Vijay Sai Reddy: వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

- కేఎస్పీఎల్, కేసెజ్‌లలో రూ. 3,600 కోట్ల విలువైన వాటాను బలవంతంగా లాక్కున్నట్టు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు
- ఈ కేసులో రెండో నిందితుడిగా విజయసాయి
- రెండు నెలల క్రితమే విచారించిన ఈడీ
- రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లలో రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) నుంచి బలవంతంగా లాక్కున్నట్టు విజయసాయిరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసులో రేపు (బుధవారం) ఉదయం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు రెండు రోజుల క్రితం అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. విజయసాయి లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు.
ఈ కేసులో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు కాగా, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి ఏ1గా ఉన్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్టు గుర్తించిన ఈడీ.. రెండు నెలల క్రితమే విజయసాయిరెడ్డిని విచారించింది. ఇప్పుడు ఇదే కేసులో విచారణకు సీఐడీ రంగంలోకి దిగింది.