Nagababu: నాగబాబు, బీద రవిచంద్ర సహా ఎమ్మెల్సీలుగా ఐదుగురు ఏకగ్రీవం

Five MLCs elected unanimously under MLA quota in Andhra Pradesh
  • టీడీపీ నుండి ముగ్గురు నామినేషన్లు
  • బీజేపీ నుండి సోము వీర్రాజు, జనసేన నుండి నాగబాబు నామినేషన్లు
  • ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు సాయంత్రంతో ముగిసింది. టీడీపీ నుండి ముగ్గురు, జనసేన, బీజేపీ నుండి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

ఏకగ్రీవం కావడంతో జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు), బీద రవిచంద్ర (టీడీపీ), బి. తిరుమల నాయుడు (టీడీపీ), కావలి గ్రీష్మ (టీడీపీ), సోము వీర్రాజు (బీజేపీ) ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ఆర్. వనితారావు వెల్లడించారు. అభ్యర్థులకు ధ్రవీకరణ పత్రాలు అందించారు.
Nagababu
Somu Veerraju
Telugudesam
BJP

More Telugu News