Nara Lokesh: మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh participated in the Kalyana Mahotsavam of Sri Lakshmi Narasimha Swamy of Mangalagiri
  • స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న‌ రాత్రి 12.00 గంట‌లకు క‌ల్యాణ మహోత్సవం
  • సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి లోకేశ్‌
  • ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు 
యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున మంత్రి లోకేశ్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. 

వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విష్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాదప్రక్షాళన, విశేష అర్చన, మహా సంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. 

మంత్రి లోకేశ్‌ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు నారా లోకేశ్‌ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Nara Lokesh
Kaḷyaṇa Mahotsavam
Sri Lakshmi Narasimha Swamy
Mangalagiri

More Telugu News