Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే!

Surekha Vani daughter Supritha apologies to social media followers
  • బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని చెప్పిన సుప్రీత
  • తెలిసో, తెలియకో చేశానని... తనను క్షమించాలన్న సుప్రీత
  • అందరూ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని విన్నపం
సినీ నటి సురేఖావాణి కూతురు సుప్రీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరితో కలిసి ఆమె ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. దీంతోపాటు, పీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా హోలీ సందర్భంగా అభిమానులకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు క్షమాపణలు కూడా కోరింది. 

సురేఖ క్షమాపణలు చెప్పడానికి పెద్ద కారణమే ఉంది. బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న వారిపై గత కొన్ని రోజులుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీత స్పందిస్తూ... తాను కూడా తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశానని చెప్పింది. ఇక నుంచి అలాంటి ప్రమోషన్లు చేయనని... మీరు కూడా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని కోరింది. ఎవరూ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయవద్దని హితవు పలికింది. 

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని సుప్రీత కోరింది. బెట్టింగ్ యాప్స్ ను అందరూ వెంటనే డిలీట్ చేయాలని చెప్పింది. సోషల్ మీడియాలో కూడా వాటిని ఫాలో కావద్దని కోరింది.
Supritha
Surekha Vani
Tollywood

More Telugu News