T. Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం.. హైకోర్టులో ప్ర‌భాక‌ర్ రావు పిటిష‌న్!

Prabhakar Rao Files Bail Plea in Phone Tapping Case
  • తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు
  • ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా టి. ప్ర‌భాక‌ర్ రావు
  • త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిష‌న్
తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని ప్ర‌ధాన నిందితుడు టి. ప్ర‌భాక‌ర్ రావు హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ వేశారు. ప్ర‌స్తుతం తాను లంగ్ ఇన్‌ఫెక్ష‌న్‌, క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాని, చికిత్స కోసం అమెరికాకు వ‌చ్చిన‌ట్లు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో త‌న‌ను నిందితుడిగా చేర్చ‌డానికి ముందే అమెరికాకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. 

త‌న‌కు వ్య‌తిరేకంగా ఒక్క ఆధారం కూడా లేద‌ని వెల్ల‌డించారు. అస‌లు విష‌యం తెలుసుకోకుండా నేరుగా త‌న‌పై నిందితుడిగా ముద్ర వేయ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. కాగా, గ‌తేడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయ‌న‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయిన విష‌యం తెలిసిందే.
T. Prabhakar Rao
Phone Tapping Case
Telangana High Court
Bail Petition
Medical Grounds
US Treatment
Non-Bailable Warrant
Legal Case
India

More Telugu News