Ram Charan: రాంచరణ్ బర్త్ డేను జపాన్ మహిళ ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి!

- చీరపై తెలుగులో రాంచరణ్ అని రాసిన మహిళ
- టీషర్టులు, చీరపై చెర్రీ ఫొటో ముద్రణ
- చరణ్ ఫొటోలు ఒక దగ్గర పెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్
గ్లోబల్ స్టార్ రాంచరణ్ 40వ బర్త్ డేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. చెర్రీ అంటే ఎంతో అభిమానం చూపించే ఓ జపాన్ మహిళ తన చీరపై తెలుగులో రాంచరణ్ అని రాయడమే కాకుండా ఆయన ఫొటోను కూడా ముద్రించింది. ఒక టేబుల్‌పై ఆయన ఫొటోలను పెట్టి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. టీషర్టులపైనా, చీరపైనా, సంచులపైనా రాంచరణ్ ఫొటోలను ముద్రించి అభిమానాన్ని చాటుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆర్సీ 16. చెర్రీ బర్త్ డేను పురస్కరించుకొని ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్టే ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గుబురు గడ్డం, పొడవాటి జట్టుతో చరణ్ ఊరమాస్ లుక్‌లో అదరగొట్టారు. ఈ మూవీలో చెర్రీ పక్కన హీరోయిన్గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా... శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.



