Central Government: పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

- పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కోరిన టీజీ ప్రభుత్వం
- కృష్ణా నది జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కోర్టులో ఉందన్న కేంద్రం
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వెనక్కి పంపించామన్న కేంద్ర జల్ శక్తి శాఖ
పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
కృష్ణా నది జలాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం కోర్టులో ఉందని... ఈ నేపథ్యంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరిగి పంపించినట్టు లోక్ సభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జల్ శక్తి శాఖ లిఖిత పూర్వకంగా ఈ మేరకు సమాధానం ఇచ్చింది.