Narendra Modi: వణికించిన భూకంపం: మయన్మార్ అధికారులతో మాట్లాడిన ప్రధాని మోదీ

PM Modi Speaks with Myanmar Officials After Devastating Earthquake
  • మయన్మార్ మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌తో మాట్లాడిన ప్రధాని
  • 'ఆపరేషన్ బ్రహ్మ'లో భాగంగా విపత్తు సహాయక సామగ్రిని, దళాలను పంపిస్తున్నట్లు వెల్లడి
  • క్లిష్ట పరిస్థితుల్లో మిత్ర దేశానికి అండగా ఉంటామని భరోసా
'ఆపరేషన్ బ్రహ్మ'లో భాగంగా విపత్తు సహాయక సామగ్రిని, దళాలను పంపిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌కు తెలియజేశారు. మయన్మార్‌ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. భూకంప విలయానికి మయన్మార్‌లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ప్రకృతి విపత్తుతో అల్లాడుతున్న మయన్మార్‌కు సహాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది.

మిన్ ఆంగ్ హలాయింగ్‌తో ప్రధాని మోదీ మాట్లాడి భూకంప పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్తులో ప్రజలు మృతి చెందడంపై మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిత్ర దేశమైన మయన్మార్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మయన్మార్‌కు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

భారత్ మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించనుంది. మయన్మార్‌కు సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఈ విషయంపై చర్చించామని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయలుదేరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సహాయం అందిస్తామని తెలిపాయి.
Narendra Modi
Myanmar Earthquake
Operation Brahma
NDRF
India's aid to Myanmar
Min Aung Hlaing
Natural Disaster Relief
Myanmar military
Earthquake relief efforts

More Telugu News