ChatGPT: ఘిబ్లీ ఇమేజెస్ కోసం చాట్‌జీపీటీపై పడిన యూజర్లు.. సర్వర్ డౌన్

ChatGPT Server Down Due to High Demand for Ghibli Images
  • సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఘిబ్లీ ఇమేజెస్ ట్రెండ్
  • అందరూ ఒకేసారి చాట్‌జీపీటీపై పడటంతో సర్వర్లు డౌన్
  • వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరూ ఘిబ్లీ ఇమేజెస్ కోసం చాట్‌జీపీటీపై ఒక్కసారిగా పడటంతో దాని సర్వర్ కాస్తా డౌన్ అయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఘిబ్లీ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. దీంతో స్టూడియో ఘిబ్లీ స్టైల్ యానిమేటెడ్ అవతార్ల కోసం యూజర్లు పోటీపడుతున్నారు. వెబ్‌సైట్ల అంతరాయాలను నివేదించే ‘డౌన్‌డిటెక్టర్’ కథనం ప్రకారం ఓపెన్ఏఐకి సంబంధించి ఇప్పటి వరకు 229 ఫిర్యాదులు వచ్చాయి. వారిలో 59 శాతం మంది యూజర్లు చాట్‌జీపీటీపై ఫిర్యాదులు చేశారు. 

చాట్‌జీపీటీ-4ఓ అప్‌డేట్ ద్వారా ఓపెన్ఏఐ అత్యంత అధునాతన ఇమేజ్ జనరేటర్‌ను తీసుకొచ్చింది. ‘స్పిరిటెడ్ అవే’, ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ వంటి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రాల్లో కనిపించిన మియాజాకి చేతితో గీసిన యానిమేషన్ శైలిలో చిత్రాలను రూపొందించేందుకు యూజర్లకు ఇది అనుమతినిస్తుంది. 

చాట్‌జీపీటీలో తమ చిత్రాలను చూడటం ప్రజలకు సరదాగా ఉంది కానీ, తమ జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) కరిగిపోతున్నాయని ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్‌మాన్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనిని మరింత సమర్థవంతంగా చేసేందుకు తాత్కాలికంగా కొన్ని ధరల పరిమితులు విధించబోతున్నట్టు చెప్పారు. ఉచిత సేవలు ఎక్కువ రోజులు ఉండవని ఆయన పేర్కొన్నారు.  
ChatGPT
OpenAI
Studio Ghibli
Ghibli Images
ChatGPT Server Down
Image Generator
Sam Altman
AI Art
Anime
DownDetector

More Telugu News