Hyderabad: కేపీహెచ్బీలో బాలయ్య, మీనాక్షి చౌదరి సందడి.. వారిని చూసేందుకు ఎగబడిన ఫ్యాన్స్

- కేపీహెచ్బీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన హీరో, హీరోయిన్
- ఇది తెలుసుకుని అక్కడికి చేరుకున్న వందలాది మంది ఫ్యాన్స్
- ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డ వైనం
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. శుక్రవారం కేపీహెచ్బీలోని రోడ్డు నంబర్.01లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుసుకున్న అభిమానులు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వీరి రాకతో ఆ ప్రాంగణం అంతా రద్దీగా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ హీరో, హీరోయిన్ లోపలికి వెళ్లారు. దాంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.