Purandeshwari: రైల్వే, డిఫెన్స్ తర్వాత ఎక్కువ భూమి వక్ఫ్ దగ్గర ఉంది: పురందేశ్వరి

Purandeshwari on Wakf Bill More Land with Wakf Board than Railways Defence
  • వక్ఫ్ బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందన్న పురందేశ్వరి
  • కేవలం వక్ఫ్ బోర్డుకు సంబంధించి మాత్రమే సవరణలు చేశారని వెల్లడి
  • వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారన్న ఏపీ బీజేపీ చీఫ్
పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. అప్రజాస్వామికంగా వక్ఫ్ బిల్లు తెచ్చారని సోనియాగాంధీ అన్నారని... ఆ సమయంలో ఆమె రాజ్యసభలో ఉన్నారో లేదో తెలియదని చెప్పారు. లోక్ సభలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ లేరని ఎద్దేవా చేశారు. 3వ తేదీన లోక్ సభలో, 4వ తేదీన రాజ్యసభలో బిల్లు పాస్ అయిందని చెప్పారు. అల్లాహ్ మీద విశ్వాసంతో ధార్మిక కార్యక్రమాలకు భూమిని ఇస్తే అది వక్ఫ్ అవుతుందని అన్నారు. 

కేవలం వక్ఫ్ బోర్డుకు సంబంధించి మాత్రమే సవరణలు చేశారని... మతపరమైన అంశంలో చేయలేదని పురందేశ్వరి చెప్పారు. ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చలేదని అన్నారు. రైల్వే, డిఫెన్స్ తర్వాత ఎక్కువ భూమి ఉన్నది వక్ఫ్ బోర్డు దగ్గరేనని చెప్పారు. వక్ఫ్ భూములను సరిగ్గా వినియోగిస్తే మైనార్టీల ఇబ్బందులు దూరమవుతాయని అన్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారని చెప్పారు.

పీఎంఏవై కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు కేటాయించిన ఘనత మోదీదని పురందేశ్వరి కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ కులాల యువతీ యువకుల కోసం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలను మోదీ ప్రారంభించారని చెప్పారు. డిక్కీ అనే సంస్థను దళితుల కోసం మోదీ స్టార్ట్ చేశారని తెలిపారు.
Purandeshwari
BJP
Wakf Bill
Parliament
Muslim
Minority
Modi
Land
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News