Revanth Reddy: నేడు భద్రాద్రిలో రాములోరి కల్యాణం .. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy attends Sriramanavami Kalyanam in Bhadradri
  • భద్రాద్రిలో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకూ జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవం
  • 10.40 గంటలకు భద్రాది రామయ్యను దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు మిథిలా మండపంలో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది.

కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణమూర్తులను అలంకరించి ఊరేగింపుగా మిథిలా మండపానికి చేర్చారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు.

కాగా భద్రాచలంలో ఈరోజు జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయన ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకుంటారు. ముందుగా ఆలయంలో భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారు. అనంతరం మిథిలా మండపంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండలం సారపాకలో ఓ రేషన్ కార్డుదారుడి నివాసానికి వెళ్లి అక్కడ భోజనం చేసి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు. 
Revanth Reddy
Bhadradri Rama Kalyanam
Sriramanavami
Telangana CM
Bhadhracalam Temple
Sita Ramachandra Swamy
Kalyana Mahotsavam
Andhra Pradesh
Telangana
Religious Festival

More Telugu News