Sai Pallavi: ఇన్​ స్టాలో సాయిపల్లవి క్రేజ్ మామూలుగా లేదుగా.. ధోని, విజయ్ కూడా ఆమె ముందు దిగదుడుపే!

Sai Pallavis Instagram Reign Beats Dhoni And Vijay
 
టాలీవుడ్ లో అత్యంత పాపులర్ హీరోయిన్ సాయిపల్లవికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తోందంటే ఆ సినిమా సూపర్ హిట్ అని ఫిక్సవ్వాల్సిందే అనేంతగా పాపులర్ అయ్యారు. తాజాగా సాయిపల్లవి భారతదేశంలోనే టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, హీరో విజయ్ తదితరులను వెనక్కి నెట్టి సాయిపల్లవి ఈ ఘనత సాధించారు.

ఇన్ స్టాలో సాయి పల్లవికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి 25 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఈ ఘనత అందుకోలేదని, ఇది కేవలం సాయి పల్లవికే సొంతమని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో హీరో విజయ్ 20 శాతం జనాలను ప్రభావితం చేస్తుండగా, ధోని 17 శాతం మందిని ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు. మిగిలిన సెలబ్రిటీలలో 5 శాతం వరకు సోషల్ మీడియాలో జనాలను ప్రభావితం చేస్తున్నారట.


Sai Pallavi
Social Media Influencer
Instagram Popularity
Top Indian Celebrity
MS Dhoni
Vijay
Tollywood Actress
Indian Celebrities
Social Media Impact

More Telugu News