Priyansh Arya: ప్రియాన్ష్ ఆర్య మెరుపు సెంచరీ... చెన్నైకి భారీ టార్గెట్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్

Priyansh Aryas Blitzing Century Powers Punjab Kings
  • ఛండీగఢ్ లో పంజాబ్ కింగ్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య
  • 42  బంతుల్లో 103 పరుగులు చేసిన యంగ్ డైనమైట్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసిన పంజాబ్ 
  • దూకుడుగా ఆడిన శశాంక్ సింగ్, మార్కో యన్సెన్
యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య మెరుపు శతకం బాదడంతో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఛండీగఢ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. 

పంజాబ్ ఇన్నింగ్స్ లో ప్రియాన్ష్ ఆర్య బ్యాటింగే హైలైట్ అని చెప్పాలి. ఓవైపు వికెట్లు పడుతున్నా ఈ యంగ్ డైనమైట్ వీరబాదుడు బాదాడు. ఓపెనర్ గా వచ్చిన ప్రియాన్ష్ కేవలం 42 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు,9 సిక్సులు ఉన్నాయంటే చెన్నై బౌలర్లను ఎలా చీల్చిచెండాడో అర్థం చేసుకోవచ్చు. 

పంజాబ్ జట్టు 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా... ప్రియాన్ష్, శశాంక్ సింగ్ దూకుడైన బ్యాటింగ్ తో భారీ స్కోరు దిశగా నడిపించారు. శశాంక్ సింగ్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్య ఆరో వికెట్ రూపంలో అవుట్ కాగా... ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ వస్తూనే పరుగుల మోత మోగించాడు. యన్సెన్ 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సులతో అజేయంగా 34 పరుగులు చేశాడు. 

పంజాబ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ (0), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (9), మార్కస్ స్టొయినిస్ (4), నేహాల్ వధేరా (9), గ్లెన్ మ్యాక్స్ వెల్ (1) వంటి కీలక ఆటగాళ్లు విఫలమైనా గానీ, పంజాబ్ కింగ్స్ కు ఇంత స్కోరు వచ్చిందంటే ప్రియాన్ష్ ఆర్య సంచలన బ్యాటింగే కారణం. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, రవిచంద్రన్ అశ్విన్ 2, ముఖేశ్ చౌదరి 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.
Priyansh Arya
Punjab Kings
Chennai Super Kings
IPL 2024
Century
Cricket
Priyansh Arya Century
Shashank Singh
Marco Jansen
Chandigarh

More Telugu News