Penna Pratap Reddy: ఒంటిమిట్ట సీతారామలక్ష్మణులకు బంగారు కిరీటాలు బహూకరించిన పెన్నా సిమెంట్స్ అధినేత

- ఒంటిమిట్ట రామాలయానికి విలువైన కానుకలు
- కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన పెన్నా ప్రతాపరెడ్డి
- స్వర్ణ కిరీటాల విలువరూ.6.60 కోట్లు
పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి ఒంటిమిట్ట రామాలయానికి విలువైన కానుకలు సమర్పించారు. ఒంటిమిట్ట సీతారామలక్ష్మణులకు మూడు బంగారు కిరీటాలు బహూకరించారు. వజ్రాలు పొదిగిన ఆ స్వర్ణ కిరీటాల విలువ రూ.6.60 కోట్లు.
ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఒంటిమిట్ట రామాలయానికి విచ్చేసిన పెన్నా ప్రతాపరెడ్డి ఆ స్వర్ణ కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుమల ఆలయ ఈవో జె.శ్యామలరావులకు అందజేశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పసిడి కిరీటాలను సీతారామలక్ష్మణులకు అలంకరించారు.