Ganta Srinivasa Rao: ఫిల్మ్ క్లబ్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao Demands Visakhapatnam Film Club Overhaul
  • వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందన్న గంటా
  • ఫిల్మ్ క్లబ్ లో 15 వందల మంది సభ్యులు ఉన్నారని వెల్లడి
  • సినీ పరిశ్రమకు వైజాగ్ సెంటిమెంట్ ప్రాంతమన్న గంటా
విశాఖపట్నం ఫిల్మ్ క్లబ్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 2015లో విశాఖలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేశామని... 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందని తెలిపారు. ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో కూడా అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఫిల్మ్ క్లబ్ లో 15 వందల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. 

ఫిల్మ్ క్లబ్ కు భూమి కేటాయించి భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని గంటా చెప్పారు. వైజాగ్ కు సినీ పరిశ్రమ రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. 

సినీ పరిశ్రమకు వైజాగ్ ఒక సెంటిమెంట్ ప్రాంతమని చెప్పారు. విశాఖకు రావడానికి సినీ పెద్దలు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైజాగ్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.  
Ganta Srinivasa Rao
Visakhapatnam Film Club
Andhra Pradesh Politics
TDP
YCP
Film Industry
Visakhapatnam Film Hub
Election irregularities
Film Club reforms
Real Estate

More Telugu News