Vijay Sai Reddy: లిక్కర్ స్కామ్... ఒక రోజు ముందే విచారణకు వస్తానంటూ సిట్ కు సమాచారం పంపిన విజయసాయిరెడ్డి

Liquor Scam Vijay Sai Reddys Early Appearance Before SIT
  • లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి
  • 18న విచారణకు రావాలని సిట్ అధికారుల నోటీసులు
  • రేపు విచారణకు వస్తానని సమాచారం పంపిన విజయసాయి
వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదయింది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలంటూ విజయసాయికి ఏపీ సిట్ నోటీసులు పంపింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ విజయసాయికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. 

అయితే, ఒక రోజు ముందుగానే అంటే రేపు విచారణకు విజయసాయి హాజరుకాబోతున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. 17న విచారణకు హాజరవుతానని సమాచారం పంపారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని... అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు ఓకే చెప్పారు. రేపు విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు సమాచారం పంపారు. 
Vijay Sai Reddy
AP SIT
Liquor Scam
YSRCP
Andhra Pradesh
Investigation
Political News
Vijay Sai Reddy interrogation
AP Liquor Scam

More Telugu News