Bhumana Karunakar Reddy: భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయలేదు: తిరుపతి ఎస్పీ

Bhumana Karunakar Reddy Not Under House Arrest Tirupati SP
  • టీటీడీ గోశాలకు రావాలంటూ భూమనకు టీడీపీ సవాల్
  • భూమనను హౌస్ అరెస్ట్ చేశారంటూ వైసీపీ ప్రచారం
  • గోశాలకు వెళ్లేందుకు భూమనకు అనుమతిని ఇచ్చామన్న ఎస్పీ
తిరుమలలోని ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోశాల వద్దకు చర్చకు రావాలంటూ ఆయనకు టీడీపీ సవాల్ విసిరింది. ఆ ఛాలెంజ్ ను భూమన స్వీకరించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని చెప్పారు. గోశాలకు వెళ్లేందుకు భూమనకు పోలీసులు అనుమతినిచ్చారు. కాసేపట్లో ఆయన గోశాలకు వెళ్లే అవకాశం ఉంది. 

మరోవైపు, భూమనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. భూమనను హౌస్ అరెస్ట్ చేయలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. గోశాలకు వెళ్లడానికి భూమనకు అనుమతిని ఇచ్చామని... అయితే రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామని వెల్లడించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో వెళ్లవచ్చని భూమనకు చెప్పామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికార, విపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్లాలని చెప్పారు.
Bhumana Karunakar Reddy
Tirupati SP
TDP
YSRCP
SV Gosala
Tirumala
Cattle Deaths
Andhra Pradesh Politics
House Arrest
Political Controversy

More Telugu News