Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటికి త‌ప్పిన ప్ర‌మాదం!

Minister Ponguleti Srinivas Reddy narrowly escapes major accident
   
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రమాదం తప్పింది. శనివారం నాడు భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు కోసం నాగర్‌కర్నూల్ జిల్లా‌కు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు. 

కలెక్టరేట్ ప్రాంగణం‌లో హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో మంత్రి పొంగులేటితో పాటు కాంగ్రెస్ నేతలకు ప్రమాదం తప్పింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Ponguleti Srinivas Reddy
Helicopter Accident
Nagar Kurnool
Congress Leaders
Near Miss
Fire Accident
Bullet Firing
Political News
Andhra Pradesh
Malla Ravi

More Telugu News