Madhya Pradesh: విద్యార్థులతో మద్యం తాగించిన టీచర్‌... వీడియో వైర‌ల్‌

Viral Video Shows Teacher Drinking Alcohol with Students in Class
  • మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఘ‌ట‌న‌
  • విద్యార్థుల‌తో క‌లిసి మ‌ద్యం సేవించిన లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే టీచ‌ర్‌
  • వీడియో వైర‌ల్ కావ‌డంతో స‌స్పెండ్ అయిన వైనం
ఉపాధ్యాయ వృత్తికి క‌ళంకం తెచ్చేలా ప్రవర్తించాడో ప్రభుత్వ టీచ‌ర్‌. ఏకంగా త‌ర‌గ‌తి గదిలో మద్యం సేవించాడు. అంతేగాక విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట‌ వైర‌ల్ కావ‌డంతో ఉపాధ్యయుడిని స‌స్పెండ్ చేశారు.  

లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే ఆ ఉపాధ్యాయుడు బర్వారా బ్లాక్ పరిధిలోని ఖిర్హాని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో సింగ్ కొంద‌రు విద్యార్థుల‌కు టీ కప్పుల్లో మద్యం పోసి తాగించ‌డం ఉంది. మద్యం తాగే ముందు అందులో నీళ్లు కలపాలని ఒక స్టూడెంట్‌కు చెప్పాడు. మద్యం ఉన్న కప్పులో నీళ్లు పోయగా ఆ విద్యార్థి దానిని తాగాడు.

కాగా, ఉపాధ్యాయుడు నవీన్‌ ప్రతాప్‌ సింగ్‌ తరగతి గదిలో విద్యార్థులతో మద్యం తాగించిన వీడియో నెట్టింట‌ వైరల్ అయింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో... ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. దాంతో ఎంపీ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నిబంధనల ప్రకారం దుష్ప్రవర్తన ఆరోపణలపై లాల్ నవీన్ ప్రతాప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.
Madhya Pradesh
Lal Naveen Pratap Singh
Madhya Pradesh Teacher
School Teacher Drinking with Students
Viral Video
Suspension of Teacher
Government School
Katni District
Student Alcohol Consumption
MP Civil Services Conduct Rules
India Teacher Scan

More Telugu News