Sri Reddy: విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి

Sri Reddy at Vijaynagaram Police Station for Questioning
  • చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై దారుణ వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి
  • శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రీరెడ్డి
నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై దారుణమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఈరోజు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయింది. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చింది. పీఎస్ కు వచ్చిన ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. 

జగన్ సీఎంగా ఉన్న సమయంలో శ్రీరెడ్డి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోయింది. మహిళ అనే విచక్షణ కూడా లేకుండా సోషల్ మీడియా వేదికగా బండ బూతులు మాట్లాడింది. అయితే ఎన్నికల్లో కూటమి గెలిచిన వెంటనే ఆమె స్వరం  మార్చింది. తనను క్షమించాలని, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని ఆమె వేడుకుంది. 

'నారా లోకేశ్ అన్నయ్యా క్షమించండి' అంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె విచారణకు హాజరయ్యారు. 
Sri Reddy
Vijaynagaram Police Station
Andhra Pradesh Politics
Social Media Controversy
Nara Lokesh
Pawan Kalyan
Chandrababu Naidu
Police Investigation
Telugu Actress
Political Video

More Telugu News