Lavanya: నటుడు రాజ్ తరుణ్‌, శేఖర్ బాషాలపై లావణ్య సంచలన ఆరోపణలు

Lavanyas Shocking Allegations Against Raj Tarun and Shekhar Basha
  • నటుడు రాజ్ తరుణ్, అతని స్నేహితుడు శేఖర్ బాషా తనని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన లావణ్య
  • నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య
  • తన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదంటూ లావణ్య ఆరోపణలు
నటుడు రాజ్ తరుణ్, అతని స్నేహితుడు శేఖర్ బాషా తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా, ఇటీవల కొందరు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం కూడా నలుగురు మహిళలు ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు.

దీనిపై తాను శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణం పోయిన తర్వాత వారిని పట్టుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. 
Lavanya
Raj Tarun
Shekhar Basha
Murder Attempt
Police Complaint
Narsing Police Station
Court Case
Actor
Threat
Telugu Actress

More Telugu News