Chandrababu Naidu: చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదానికి 'భాష్యం' అధినేత భారీ విరాళం

Bhashyam Ramakrishnas Generous Donation on Chandrababu Naidus Birthday
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబుపై విషెస్ వెల్లువ
  • తిరుమలలో అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు  విరాళం ఇచ్చిన భాష్యం రామకృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 75 వసంతాల చంద్రబాబుపై జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. 

తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళంగా అందించారు. భాష్యం రామకృష్ణ నేడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమల అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Chandrababu Naidu
Birthday
Tirumala
Anna Prasadam
Bhashyam Ramakrishna
Donation
TTD
Andhra Pradesh
Charity
Srivari Anna Prasadam

More Telugu News