Mumbai Indians: టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్... సీఎస్కేపై చేజింగ్ చేయగలదా?

Mumbai Indians Win Toss Opt to Bowl Against CSK
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • రెండో మ్యాచ్ లో ముంబయి × చెన్నై
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఛేజింగ్ చేయడానికే మొగ్గుచూపింది. 

ఈ మ్యాచ్ కోసం ఎంఐ ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. సీఎస్కే టీమ్ లో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠీ స్థానంలో ఆయుష్ మాత్రే తుదిజట్టులోకి వచ్చాడని తెలిపాడు. 

టోర్నీలో ఇప్పటివరకు సీఎస్కే 7 మ్యాచ్ లు ఆడి 5 ఓటములతో పాయింట్ల పట్టికలో అందరికంటే అట్టడుగున ఉంది. అయితే గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలవడం చెన్నై జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.
Mumbai Indians
Chennai Super Kings
IPL 2023
MI vs CSK
Wankhede Stadium
MS Dhoni
Rohit Sharma
Cricket Match
IPL Playoffs
T20 Cricket

More Telugu News