Chennamaneni Ramesh: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌కు హైకోర్టులో బిగ్ షాక్‌!

Telangana HCs Big Shock to Former BRS MLA Chennamaneni Ramesh
  • ఆయ‌న భార‌త పౌరుడు కాద‌ని, జ‌ర్మ‌న్ పౌరుడ‌ని తేల్చి చెప్పిన హైకోర్టు 
  • ర‌మేశ్‌ పౌర‌స‌త్వంపై ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిష‌న్ దాఖ‌లు 
  • తాజాగా విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఈ మేర‌కు సంచ‌ల‌న తీర్పు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌కు హైకోర్టులో బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న భార‌త పౌరుడు కాద‌ని, జ‌ర్మ‌న్ పౌరుడ‌ని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆయ‌న పౌర‌స‌త్వంపై ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా... తాజాగా విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఈ మేర‌కు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది. 

ఈ సంద‌ర్భంగా త‌ప్పుడు ప‌త్రాలతో 15 ఏళ్ల పాటు ప్ర‌భుత్వ అధికారులు, న్యాయ‌స్థానాల‌ను చెన్న‌మ‌నేని ర‌మేశ్ త‌ప్పుదోవ ప‌ట్టించారని హైకోర్టు ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఈ మేర‌కు ఆయ‌న పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని న్యాయ‌స్థానం స‌మ‌ర్థించింది. 

అలాగే ఆయ‌న‌ను రూ. 30 ల‌క్ష‌ల జ‌రిమానా చెల్లించాల‌ని ఆదేశించింది. ఇందులో పిటిష‌న‌ర్ ఆది శ్రీనివాస్‌కు రూ. 25 ల‌క్ష‌లు, హైకోర్టు లీగ‌ల్ స‌ర్వీసెస్ క‌మిటీకి రూ. 5 ల‌క్ష‌లు చెల్లించాల‌ని తెలిపింది. న్యాయ‌స్థానం తీర్పుపై అప్పీల్ చేయ‌కుండా త‌న త‌ప్పును ఒప్పుకుని చెన్న‌మ‌నేని ర‌మేశ్ రూ. 30 ల‌క్ష‌ల ఫైన్‌ చెల్లించారు. 
Chennamaneni Ramesh
Telangana High Court
German Citizen
Indian Citizenship
BRS MLA
Adi Srinivas
Court Verdict
Fine
Forged Documents
Legal Case

More Telugu News