Nagur Babu: హైదరాబాద్ మెట్రో రైలుకు బెట్టింగ్ యాప్స్ సెగ.. హైకోర్టులో పిల్

- హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం ఆరోపణలు
- హైకోర్టులో మెట్రో సంస్థపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు
- న్యాయవాది నాగూర్‌బాబు పిటిషన్
- ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈడీలను చేర్చిన న్యాయవాది
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల సెగ తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను కూడా తాకింది. మెట్రో రైళ్లలోనూ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రచారాలు నిర్వహించారంటూ ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది నాగూర్‌బాబు ఈ పిల్‌ను దాఖలు చేశారు.
ప్రజా రవాణా వ్యవస్థగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మెట్రో రైలు సంస్థ, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
బెట్టింగ్ యాప్‌ల బారిన పడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువత ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్రత సంతరించుకుంది.
ఇప్పటికే ఈ కేసులో భాగంగా పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి, కొందరికి నోటీసులు జారీ చేయగా, మరికొందరిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మెట్రో రైలు సంస్థపై పిల్ దాఖలు కావడం గమనార్హం.