Sunrisers Hyderabad: ఆ ఇద్దరూ ఆదుకోకపోతే... సన్ రైజర్స్ కు ఈ మాత్రం స్కోరైనా వచ్చేది కాదు!

Sunrisers Hyderabads Poor Batting Performance Against Mumbai Indians
  • ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచిన ముంబయి
  • 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్
  • క్లాసెన్ 71, అభినవ్ మనోహర్ 43 పరుగులతో రాణింపు
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసిన ఎస్ఆర్ హెచ్
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా మరోసారి తేలిపోయింది. ఇవాళ ముంబయి ఇండియన్స్ తో సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పేలవంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. అది కూడా మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఆదుకోబట్టి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. వాళ్లిద్దరూ కూడా చేతులెత్తేసి ఉంటే, సన్ రైజర్స్ ఓ 100 లోపు స్కోరుకో పరిమితం అయ్యేదేమో! 

ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో నిలిచింది. ట్రావిస్ హెడ్ (0) డకౌట్ కాగా, అభిషేక్ శర్మ 8, ఇషాన్ కిషన్ 1, నితీశ్ కుమార్ రెడ్డి 2, అనికేత్ వర్మ 12 పరుగులు చేశారు. ఈ దశలో క్లాసెన్, అభినవ్ మనోహర్ జోడీ ఎదురుదాడికి దిగి స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. క్లాసెన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేయగా... అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేశాడు. 

ఈ మ్యాచ్ లో ముంబయి బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ వికెట్ల పండుగ చేసుకున్నారు. బౌల్ట్ కు 4, చహర్ కు 2 వికెట్లు లభించాయి. బుమ్రా 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు.
Sunrisers Hyderabad
Mumbai Indians
IPL 2023
Heinrich Klaasen
Abhinav Manohar
Trent Boult
Deepak Chahar
poor batting performance
cricket match
Uppal Stadium

More Telugu News