Chandrababu Naidu: అండమాన్ నికోబార్ లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై సీఎం చంద్రబాబు హర్షం

Chandrababu Naidu Rejoices Over TDPs Victory in Andaman Nicobar
  • శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ గా షాహుల్ హమీద్ ఎన్నిక
  • అండమాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
  • వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వెల్లడి
అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం పట్ల పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి ఎస్. షాహుల్ హమీద్ ఈ పదవికి ఎన్నిక కావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే తమ పార్టీ ప్రధాన అజెండా అని, దానితోనే ముందుకెళతామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ గెలుపునకు కృషి చేసిన స్థానిక ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి మద్దతు మరువలేనిదని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.

ఈ విజయానికి సహకరించిన పలువురు నేతలకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. టీడీపీ అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. మణిక్యరావు యాదవ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, అండమాన్ రాష్ట్ర ఇన్‌చార్జ్ వి. మాధవ నాయుడు ఎంతో కృషి చేశారంటూ ఆయన ప్రశంసించారు. అదేవిధంగా, ఈ ఎన్నికల్లో సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజోయ్ బైరాగికి కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Naidu
TDP
Andaman Nicobar Islands
Municipal Council Elections
Sri Vijayapuram
S. Shahul Hameed
N. Manikyarao Yadav
V. Madhava Naidu
BJP
Ajoy Bairagi

More Telugu News