Samantha: అతనితో నాది ప్రత్యేక బంధం.. ఆ అనుబంధానికి పేరు పెట్టలేను: సమంత

Samanthas Special Bond with Rahul Ravindran
  • రాహుల్ రవీంద్రన్ పై తన అభిమానాన్ని వెల్లడించిన సమంత
  • ఆరోగ్యం బాగోలేని సమయంలో తనకు అండగా ఉన్నాడని వెల్లడి
  • అభిమానుల మద్దతు తన అదృష్టమని వ్యాఖ్య
సినీ హీరోయిన్ సమంత తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోల్డెన్ క్వీన్' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు.

తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. "ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి ఓ పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను" అంటూ రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. అభిమానుల మద్దతు తన అదృష్టమని, తన కష్టం, లక్ వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. కెరీర్ గురించి మాట్లాడుతూ, "మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. తెలిసీ, తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి" అని సమంత అన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకురాలు సుధ కొంగర సమంతపై ప్రశంసలు కురిపించారు. తాను సమంతకు పెద్ద అభిమానినని, గత ఐదేళ్లుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నానని తెలిపారు. ఆమె కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చేవని, ఎంతోమంది అమ్మాయిలకు సమంత స్ఫూర్తి అని అన్నారు. "సమంతతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఎప్పటికైనా ఆమెతో కచ్చితంగా సినిమా తీస్తాను. ఆమె నటించిన 'ఊ అంటావా..' పాట నాకెంతో ఇష్టం" అని సుధ కొంగర చెప్పారు. దీనికి సమంత స్పందిస్తూ, తనకు యాక్షన్ సినిమా చేయాలని ఉందని తెలిపారు. తప్పకుండా యాక్షన్ సినిమా చేద్దామని సుధ కొంగర బదులిచ్చారు.
Samantha
Rahul Ravindran
Samantha Ruth Prabhu
Tollywood
Kollywood
Golden Queen Award
Suha Konagara
Telugu Actress
Film Career
Health struggles

More Telugu News