Rupesh: భద్రతా బలగాల అతి పెద్ద ఆపరేషన్... మావోయిస్టుల సంచలన లేఖ

Maoists Issue Sensational Letter Amidst Security Operation
  • మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రకటన విడుదల
  • కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపేయాలని విజ్ఞప్తి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలన్న రూపేశ్
మావోయిస్టుల నుంచి సంచలన లేఖ విడుదలైంది. తెలంగాణ-ఛ‌త్తీస్‌గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాల‌ని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగట్ట, నాడ్‌పల్లి, పూజారి కాంకేర్ అటవీ ప్రాంతాల్లోని 'మావోయిస్టు బెటాలియన్ నెం.1' స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ స్థావరంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు, కీలక కమాండర్లు ఉన్నట్టు భద్రత బలగాలు భావిస్తున్నాయి. దాదాపు 10 వేల మంది సుశిక్షితులైన కమాండోలు ఈ స్థావరం దిశగా దూసుకుపోతున్నారు. మావోయిస్టులను ఏరిపారేసే కార్యాచరణలో చరిత్రలోనే ఇది అతి పెద్ద ఆపరేషన్ అని కేంద్రం చెబుతోంది.
Rupesh
Maoists
Chhattisgarh
Telangana
Maharashtra
Security Forces Operation
Combating Operation
Peace Talks
Maoist Letter
Bastar

More Telugu News