Sunrisers Hyderabad: సన్ రైజర్స్ టాస్ గెలిచింది.. కానీ...!

Sunrisers Hyderabad Wins Toss Against CSK
  • ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × సీఎస్కే
  • చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో కేవలం రెండే విజయాలు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతోంది. చెన్నై జట్టు కూడా 8 మ్యాచ్ ల్లో 2 విజయాలతో సమవుజ్జీగా ఉంది. నేడు సన్ రైజర్స్, సీఎస్కే జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. 

టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి దెబ్బతిన్న అనుభవంతో ఇవాళ బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అటు, సీఎస్కే జట్టులో రెండు మార్పులు జరిగాయని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్ స్థానంలో డివాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా జట్టులోకి వచ్చారని తెలిపాడు.
Sunrisers Hyderabad
Chennai Super Kings
IPL 2023
MS Dhoni
Mohammad Shami
Deepak Hooda
Match Highlights
Cricket Match
MA Chidambaram Stadium

More Telugu News