Chain Snatching: మంగళసూత్రం లాక్కెళుతుంటే వెంటాడి పట్టుకున్న దంపతులు.. కీసరలో ఘటన

Couple Catches Chain Snatcher in Kesara
--
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. బైక్ పై వెళుతున్న భార్యాభర్తలను వెంటాడిన ఓ దొంగ.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. వెంటనే తేరుకున్న ఆ మహిళ భర్త తన బైక్ తో దొంగను ఛేజ్ చేశాడు. కీసరలో స్థానికుల సాయంతో ఆ దొంగను పట్టుకుని చితకబాదాడు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు. 

కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు చింతల పద్మ తెలిపారు. భర్తతో కలిసి బైక్ పై వెళుతుంటే వెనక నుంచి వచ్చిన దొంగ తన మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Chain Snatching
Kesara
Yadagiripalli
Hyderabad
Chintala Padma
Crime News
Telangana Police
Bike Chase
Robbery

More Telugu News