Delhi Capitals: భువీ, హేజెల్ వుడ్ ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ, ఢిల్లీ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడలేక తడబడ్డారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ 41, ట్రిస్టాన్ స్టబ్స్ 34, అభిషేక్ పోరెల్ 28, డుప్లెసిస్ 22 పరుగులు చేశారు. కరుణ్ నాయర్ 4, కెప్టెన్ అక్షర్ పటేల్ 15 పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, జోష్ హేజెల్ వుడ్ 2, యశ్ దయాళ్ 1, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.