Simhachalam Appanna: సింహచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు .. నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న

Simhachalam Appanna Darshan Devotees Flock to Witness the Deity
  • స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు
  • రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
  • క్యూలైన్లలో బారులుతీరి అప్పన్న స్వామిని నిజరూపంలో దర్శించుకుంటున్న భక్తులు
విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి చందనోత్సవంలో పాల్గొని నిజరూపంలో వరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. మంగళవారం రాత్రి నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వేకువజామున ఒంటి గంటకు స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలుపు పలికారు. ఆ తరువాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా తొలగించారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు.

ఆలయంలో వైదిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువ జామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.

తదుపరి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్న సాధారణ భక్తులు నిజరూపంలో అప్పన్నను దర్శించుకుంటున్నారు. కాగా రూ.300ల టికెట్ కౌంటర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనతో ఆలయం వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 
Simhachalam Appanna
Simhachalam Temple
Visakhapatnam Temple
Chandanotsavam
Appanna Swami
Varahaswamy
Pusapati Ashok Gajapathi Raju

More Telugu News