Champat Rai: అయోధ్య రామమందిర శిఖరంపై 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్ఠ

42 Foot Flagstaff Installed at Ayodhya Ram Mandir
  • అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిర శిఖరంపై ధ్వజస్తంభ ప్రతిష్ఠా క్రతువు
  • ఎక్స్ వేదికగా వెల్లడించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్
అయోధ్య రామమందిర శిఖరంపై అక్షయ తృతీయ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

42 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. సంబంధిత ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

రామమందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని, రామ్ దర్బార్‌లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 
Champat Rai
Ayodhya Ram Mandir
Dhwajasthambha
Ram Mandir Construction
42 feet flagstaff
Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust
Ayodhya

More Telugu News