MS Dhoni: తర్వాతి మ్యాచ్ ఆడతానో లేదో తేలియదన్న ధోని.. వీడియో ఇదిగో!

Dhonis Future Uncertain After CSKs IPL Loss
--
ఐపీఎల్ 25 సీజన్ లో భాగంగా బుధవారం చెన్నై- పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం విదితమే. ఈ మ్యాచ్ లో టాస్ అనంతరం ధోనీ, కామెంటేటర్ డానీ మోరిసన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తర్వాతి సీజన్ లోనూ మీరు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారని డానీ మోరిసన్ పేర్కొనగా.. తర్వాతి సీజన్ సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ తర్వాత జరిగే మ్యాచ్ లో ఆడతానో లేదో కూడా తనకు తెలియదని ధోనీ బదులిచ్చాడు. 

కాగా, ధోనీ మాట్లాడేందుకు మైక్ అందుకోగానే అభిమానులు నినాదాలతో చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా, చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. దీంతో సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.
MS Dhoni
IPL 2023
Chennai Super Kings
CSK
Danny Morrison
IPL Playoffs
Dhoni Retirement
Chepauk Stadium
Dhoni Interview
Cricket

More Telugu News