Vidala Gopi: పోలీసు కస్టడీలో విడదల రజని మరిది... విచారణ ప్రారంభం

- ఓ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసు
- నిందితులుగా రజని, విడదల గోపి తదితరులు
- గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో గోపిని విచారిస్తున్న అధికారులు
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు ఈ నెల 24న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లాలోని ఓ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో గోపితో పాటు రజని కూడా నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో గోపి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించేందుకు గోపిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అధికారులు కోరగా... రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో, ఈ ఉదయం గోపిని జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.