YS Jagan Mohan Reddy: మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

Minister Nimmalas Sensational Remarks Against Ex CM Jagan
  • ఆయన వైసీపీకి కాదు, రాబందుల పార్టీకి అధ్యక్షుడంటూ ఫైర్
  • పకృతి విపత్తులపై రాజకీయాలు చేయడమేంటని ఆగ్రహం
  • రాజధాని పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీకి కాదు రాబందుల పార్టీకి అధ్యక్షుడని దుయ్యబట్టారు. పకృతి వైపరీత్యాలను సైతం రాజకీయంగా వాడుకోవాలని చూడడం దారుణమని మండిపడ్డారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ హయాంలో బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులు తప్ప ఏంజరిగిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన రాజధాని పునర్నిర్మాణం దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు గౌరవించేలా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో రూ.1.63 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
YS Jagan Mohan Reddy
Nimmala Rama Naidu
Andhra Pradesh Politics
Amaravati
TDP
YCP
Political Controversy
West Godavari
India Politics
State Politics

More Telugu News