Lavanya Tripathi: తల్లిదండ్రులు కాబోతున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్..?

Lavanya Tripathi and Varun Tej Expecting a B
  • సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
  • ఇంకా అధికారికంగా ప్రకటించని మెగా ఫ్యామిలీ
  • ఇప్పటికే శుభాకాంక్షలు చెబుతున్న మెగా ఫ్యాన్స్
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి వస్తున్న ఈ వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

లావణ్య తల్లి కాబోతుండటంతో మెగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే మెగా కుటుంబం ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటిస్తుందని కూడా కొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ వరుణ్, లావణ్య దంపతులకు మెగాఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్ విషయానికొస్తే, 2023లో ఆయన నటించిన 'గాండీవధారి అర్జున', గతేడాది వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి 'VT-15' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Lavanya Tripathi
Varun Tej
Tollywood
Pregnancy
Mega Family
Telugu Cinema
Actor
Actress
Couple
Expecting Parents

More Telugu News