Yuzvendra Chahal: అరుదైన ఘనత... ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసింది వీరే

- నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన చాహల్
- 19వ ఓవర్‌లో చాహల్ ఘనత
- అంతకుముందు ఈ ఫీట్ సాధించిన అమిత్ మిశ్రా, ఆండ్రూ రస్సెల్
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం నాలుగుసార్లు మాత్రమే జరిగింది. ఇందులో యుజ్వేంద్ర చాహల్ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో బౌలింగ్ చేసి హ్యాట్రిక్‌తో సహా 4 వికెట్లు తీశాడు. అంతకుముందు, 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన చాహల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై నాలుగు వికెట్లు తీశాడు. తాజాగా, నిన్న రెండోసారి ఈ ఘనత సాధించాడు.
చాహల్‌తో సహా ముగ్గురు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 2013 ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అమిత్ మిశ్రా పుణే వారియర్స్‌పై నాలుగు వికెట్లు సాధించాడు. 2022 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ గుజరాత్ టైటాన్స్‌పై ఈ ఘనత సాధించాడు.