KA movie: కిరణ్‌ అబ్బవరం ‘క’ మూవీకి అరుదైన గౌర‌వం

Kiran Abbavarams KA Wins Dada Saheb Phalke Award
  • ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్త‌మ చిత్రంగా అవార్డు సొంతం 
  • ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు సుజిత్‌, సందీప్‌లు సంయుక్తంగా దర్శకత్వం
  • చిన్న సినిమాగా గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై ‘క’ భారీ విజయం
టాలీవుడ్ యువ నటుడు కిరణ్‌ అబ్బవరం న‌టించిన ‘క’ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్త‌మ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా బృందానికి నెటిజ‌న్లు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు సుజిత్‌, సందీప్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 

కిరణ్‌ అబ్బవరం సొంత బ్యానర్‌ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. నయన్‌ సారిక, త‌న్వీ రాయ్‌లు క‌థానాయిక‌లుగా నటించారు. చిన్న సినిమాగా గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై ‘క’ భారీ విజయం సాధించింది. మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన‌ ఈ చిత్రం కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 

పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా థియేటర్ల కొరత కారణంగా మొదట తెలుగులో మాత్రమే విడుదలైంది. అయినప్పటి ఈ చిత్రం ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన అందుకుని పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ కొట్టింది. తాజాగా అరుదైన ఘనతను దక్కించుకుంది. 
 
‘క’ కథ ఇదే..
ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం డబుల్‌ రోల్లో కనిపించాడు. డాల్‌బీ విజన్‌: ఆటమ్స్ టెక్నాలజీలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కిరణ్‌ అబ్బవరం అభినయ్‌ వాసుదేవ్‌ అనాథ పాత్రలో కనిపించాడు. అనాథ అవ్వడం వల్ల ఆశ్రమానికి వచ్చిన ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వారిని తన సొంతవాళ్లుగా ఊహించుకుంటాడు. ఈ క్రమంలో కొందరికి అతడే సమాధానాలు ఇస్తుంటాడు. ఈ అలవాటు రాను రాను వాసుదేవ్‌కి ఆసక్తిగా మారుతుంది. దీంతో పోస్ట్‌ మ్యాన్‌ అయితే ఎన్నో ఉత్తరాలు చదవోచ్చు అనుకుంటాడు. 

అలా కృష్ణగిరి అనే గ్రామానికి వెళతాడు. అక్కడ అసిస్టెంట్‌ పోస్ట్‌ మ్యాన్‌ ఉద్యోగంలో చేరతాడు. ఈ క్రమంలో వాసుదేవ్‌ కంట ఓ ఉత్తరం పడుతుంది. అందులో గ్రామంలో ఆడవాళ్లు మిస్‌ అవ్వడానికి గల కారణం ఏంటి? దాని వెనక ఉన్న ర‌హ‌స్యాన్ని తెలుసుకుంటాడు. ఇక వారిని పట్టుకునే క్రమంలో వాసుదేవ్‌ వెంట ఓ ముసుగు గ్యాంగ్‌ పడుతుంది. ఓ సారి అతడిని అరెస్ట్‌ చేసి ఓ చీకటి గదిలో బంధిస్తారు. 

ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అతడితో పాటు కిడ్నాప్‌కు గురైన రాధ ఎవరూ? ఆమెకు, వాసుదేవ్‌ మధ్య సంబంధం ఏంటనేది? ‘క’ కథ. దీనికి సీక్వెల్‌గా 'క 2' ఉంటుంద‌ని ఇప్ప‌టికే చిత్రం యూనిట్ ప్ర‌క‌టించింది. అంతేగాక 'పార్ట్ 1' కంటే కూడా 'పార్ట్ 2' మ‌రింత ఆస‌క్తిక‌రంగా, ఉత్కంఠ‌ను క‌లిగించేలా ఉంటుంద‌ని మేక‌ర్స్ తెలిపారు.  
KA movie
Kiran Abbavaram
Dada Saheb Phalke Film Festival
Best Film Award
Fantasy Thriller
Telugu Cinema
Sujith
Sandeep
Nayan Sarica
Tanvi Rai

More Telugu News