Narendra Modi: మీరు ఇలాంటి పోర్టును గుజరాత్ లో ఎందుకు కట్టలేదు?: అదానీతో మోదీ

Modis Question to Adani Why Not Such a Port in Gujarat
  • కేరళలో విఝింజం పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
  • పోర్ట్ అద్భుతంగా నిర్మించారంటూ గౌతమ్ అదానీకి ప్రశంసలు
  • గుజరాత్‌లో అదానీ ఇలాంటి పోర్ట్ నిర్మించలేదంటూ సరదా వ్యాఖ్య
కేరళలో అదానీ గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన విఝింజం అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పోర్టు నిర్మాణంలో అదానీ గ్రూప్ పనితీరును, ప్రత్యేకంగా గౌతమ్ అదానీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా పోర్టు నిర్మాణాన్ని, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పోర్టు నిర్మాణం అద్భుతంగా ఉందని కితాబిచ్చిన ప్రధాని, అదే సమయంలో గుజరాత్‌ను ప్రస్తావిస్తూ సరదాగా చేసిన వ్యాఖ్య సభికులను నవ్వించింది.

పోర్టును సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "నేను ఇప్పుడే పోర్టును చూసి వస్తున్నాను. అదానీ దీన్ని అత్యద్భుతంగా నిర్మించారు. నిజంగా, ఇంత గొప్ప పోర్టును నేను ఇప్పటివరకు చూడలేదు" అని ప్రశంసించారు. 

వెంటనే చమత్కరిస్తూ, "గౌతమ్ అదానీ గుజరాత్‌లో దాదాపు 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు, కానీ అక్కడ ఇలాంటి పోర్టును నిర్మించలేదు" అని వ్యాఖ్యానించారు. ఈ మాట విన్న సభికుల్లో నవ్వులు విరిశాయి. దీనిపై మోదీ కొనసాగిస్తూ, "నేను ఇలా అన్నానని గుజరాత్ ప్రజలు ఆయనపై (అదానీపై) కోప్పడతారేమో!" అని సరదాగా అనడంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.
Narendra Modi
Gautam Adani
Adani Group
Vizhinjam Port
Kerala
Deepwater Port
Gujarat
India
Port Inauguration
Modi's comments

More Telugu News