Narendra Modi: అమరావతి సభా వేదికపైకి వచ్చిన మోదీ, చంద్రబాబు... వేదికపై ఎవరెవరు ఉన్నారంటే..!

Modi Chandrababu Naidu Grace Amaravati Event
  • అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ వేడుక
  • మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం, డిప్యూటీ సీఎం
  • వేదికపై లోకేశ్, నారాయణ, పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, నాదెండ్ల తదితరులు
ఏపీ రాజధాని అమారావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తరలివచ్చారు. రాష్ట్ర సెక్రటేరియట్ వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్ద ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా సభాస్థలికి బయల్దేరారు. ముందుగానే గవర్నర్, డిప్యూటీ సీఎం సభా వేదికపైకి వచ్చారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. మోదీకి ఈ సందర్భంగా ధర్మవరంలో ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత వస్త్రాన్ని చంద్రబాబు కప్పారు. కలంకారీ చేనేత కళాకారులు తయారు చేసిన మోదీ చిత్రపటాన్ని ఆయనకు సీఎం, డిప్యూటీ సీఎం బహకరించారు.  

సభావేదికపై మోదీ, రాష్ట్ర గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ ప్రసంగిస్తున్నారు.
Narendra Modi
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Pawan Kalyan
Nara Lokesh
AP Secretariat
Inauguration
Modi's Visit
State Ministers

More Telugu News