Sonia Gandhi: సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు

Sonia  Rahul Gandhi Served Notices by Delhi Court
  • నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు
  • ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై వివరణ కోరిన కోర్టు
  • కేసు తదుపరి విచారణ మే 7కు వాయిదా
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, దీనిపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.

గతంలో సరైన పత్రాలు లేవన్న కారణంతో నోటీసుల జారీకి నిరాకరించిన కోర్టు, తాజాగా ఈడీ అభ్యర్థన మేరకు చర్యలు చేపట్టింది. చార్జిషీట్‌పై విచారణకు ముందు నిందితుల వాదనలు వినాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేశారు.


Sonia Gandhi
Rahul Gandhi
National Herald Case
Money Laundering
Delhi Court
Rouse Avenue Court
ED Chargesheet
May 7 Hearing
Congress Leaders
Indian Politics

More Telugu News