Chandrababu: అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం.. సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

Chandrababu Naidu Thanks Public for Successful Restart of Amaravati Works
  
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, భాగస్వామ్య పక్షాలకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ఒక ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 

ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి, మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. 
Chandrababu
Amaravati
Andhra Pradesh
Capital City
Narendra Modi
Restart of Amaravati works
Development
Future City
Government Officials
Media

More Telugu News