RCB: ప్లేఆఫ్స్ కు అడుగుదూరంలో ఆర్సీబీ... టాస్ గెలిచిన సీఎస్కే

IPL 2025 RCB vs CSK as Bangalore Eyes Playoff Berth
ఐపీఎల్ లో ఇవాళ ఆర్సీబీ × సీఎస్కే
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై టీమ్
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో ఓడినా, గెలిచినా సీఎస్కే జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే, ఆ జట్టు ఇప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

మరోవైపు, ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్ దశలోకి దూసుకెళుతుంది. బెంగళూరు టీమ్ ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 7 విజయాలు సాధించింది. మరోవైపు చెన్నై 10 మ్యాచ్ లు ఆడి 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే చివరన ఉంది. 

నేడు బెంగళూరుతో మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని సీఎస్కే సారథి ధోనీ వెల్లడించాడు. బెంగళూరు టీమ్ లో మాత్రం ఒక మార్పు జరిగింది. పొడగరి ఫాస్ట్ బౌలర్ జోష్ హేజెల్ వుడ్ స్థానంలో సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి జట్టులోకి వచ్చాడు.
RCB
CSK
IPL 2023
Playoff Race
MS Dhoni
Royal Challengers Bangalore
Chennai Super Kings
Chinnaswamy Stadium
Lungi Ngidi
Josh Hazelwood

More Telugu News