Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన కోహ్లీ.. వార్న‌ర్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్‌!

Kohli Creates History Breaks Warners All Time IPL Record
  • నిన్న బెంగ‌ళూరులో సీఎస్‌కే వ‌ర్సెస్ ఆర్‌సీబీ
  • రెండు ర‌న్స్ తేడాతో ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్ట‌రీ
  • 33 బంతుల్లో 62 ర‌న్స్‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • ఈ 62 ప‌రుగుల‌తో సీఎస్‌కేపై 1,146 ర‌న్స్ పూర్తి చేసుకున్న వైనం
  • త‌ద్వారా ఒక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక ర‌న్స్‌ చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డు
శ‌నివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రెండు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీ న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 ర‌న్స్‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇది ఈ సీజ‌న్‌లో ర‌న్ మెషీన్‌కు ఏడ‌వ హాఫ్ సెంచ‌రీ. ఇక‌, ఈ అద్భుత‌మైన ఇన్నింగ్స్ కార‌ణంగా కోహ్లీ ఐపీఎల్‌లో ఓ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అది కూడా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అధిగమించి ఈ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకోవ‌డం విశేషం.

కోహ్లీ నిన్న చేసిన 62 ప‌రుగుల‌తో సీఎస్‌కేపై 1,146 ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు. త‌ద్వారా ఒక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. కోహ్లీ కంటే ముందు డేవిడ్ వార్నర్ పేరిట ఈ రికార్డు ఉండేది. అత‌డు పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)పై 1,134 పరుగులు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు
1,146 - విరాట్ కోహ్లీ వ‌ర్సెస్ (సీఎస్‌కే) 
1,134 - డేవిడ్ వార్నర్ వ‌ర్సెస్ (పీబీకేఎస్)
1,130 - విరాట్ కోహ్లీ వ‌ర్సెస్ (డీసీ)
1,104 - విరాట్ కోహ్లీ వ‌ర్సెస్ (పీబీకేఎస్)
1,093 - డేవిడ్ వార్నర్ వ‌ర్సెస్ (కేకేఆర్‌)

ఇక‌, ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో చెన్నై ఆఖరి వరకు పోరాడింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో సీఎస్‌కే విజ‌యానికి 15 ర‌న్స్ కావాల్సి ఉండ‌గా... 13 ప‌రుగులే చేసింది. దాంతో రెండు ప‌రుగుల తేడాతో బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. 

అయితే, సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో 17 ఏళ్ల యువ కెరటం ఆయుష్ మాత్రే అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 94 రన్స్ బాది, త్రుటిలో శ‌త‌కం చేజార్చుకున్నాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండ‌ర్‌ రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్) కూడా రాణించాడు. కానీ, చెన్నైను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఆర్‌సీబీ బౌల‌ర్ యశ్ దయాల్‌ ఒత్తిడిని అధిగమించి ఆఖ‌రి ఓవ‌ర్ ను జాగ్రత్తగా వేసి త‌న జ‌ట్టుకు రెండు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు.
Virat Kohli
IPL
RCB
CSK
David Warner
IPL Records
Cricket
Indian Premier League
Royal Challengers Bangalore
Chennai Super Kings

More Telugu News