Pragya Jaiswal: బాలయ్యపై హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెట్టింట పోస్ట్ వైరల్!

నందమూరి బాలకృష్ణ, యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ 'అఖండ', 'డాకు మహారాజ్' సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. దీంతో బాలయ్యతో ప్రగ్యాకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రగ్యా... తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని రాసుకొచ్చారు.
దాంతో చాలా మంది ఇన్స్టా యూజర్లు ఆమెను వివిధ ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యూజర్ ఆమెను బాలయ్యపై ప్రశ్న అడిగారు. బాలకృష్ణ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని అడగగా... "క్రమశిక్షణ, సమయపాలన, సినిమాపై ఇష్టం, ప్రతిరోజూ దానికోసం ఆయన 1000 శాతం ఎఫర్ట్ పెట్టడం" అని ప్రగ్యా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు.