MLA Adi Srinivas: ఎమ్మెల్యేకు గల్ఫ్ లో ఉద్యోగం ఇప్పిస్తారట.. ట్రావెల్ ఏజెన్సీ ఫోన్ కాల్

MLA Receives Scam Call Offering Gulf Jobs
  • జగిత్యాలలో అమాయకులను మోసం చేస్తున్న ట్రావెల్స్ నిర్వాహకులు
  • ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి ఉపాధి కల్పిస్తామని ఆఫర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వాహకుల గుట్టు బయటపడింది. పొరపాటున ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తాం.. ఉపాధి కల్పిస్తాం అంటూ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంతో గుట్టు రట్టయింది. ఈ ఫోన్ కాల్ పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ జరిపి సదరు ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని తేల్చారు. ట్రావెల్ ఏజెన్సీని మూసేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. సారంగాపూర్ మండలం రంగంపేటకు చెందిన నవీన్ జగిత్యాలలో ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నాడు. ఇందుకోసం ఓ యువతిని నియమించుకుని ఫోన్ చేయిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. రోజూలాగే నవీన్ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఆ యువతి ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దని తెలియక గల్ఫ్ లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని నమ్మబలికింది.

తనకు ఎందుకు ఫోన్ చేశావని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియక యువతి ఎమ్మెల్యేపైనే యువతి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు సదరు ట్రావెల్స్ సంస్థపై దాడి చేశారు. ట్రావెల్స్ నిర్వహణకు నవీన్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
MLA Adi Srinivas
Jagityal Travel Agency Scam
Gulf Jobs Scam
Navin Arrested
Fake Travel Agency
Employment Fraud
Telangana Police
Sarangapur
Rangampet
Job Scam

More Telugu News