Kankajur': అడుగడుగునా టెన్షన్ పెట్టే క్రైమ్ థ్రిల్లర్ .. సోనీలివ్ లో!

kankhajur Series Update
  • క్రైమ్ థ్రిల్లర్ గా 'కంఖజూర'
  • ప్రధాన పాత్రల్లో మోహిత్ రైనా - రోషన్ మాథ్యూ 
  • ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • ఉత్కంఠను పెంచుతున్న కంటెంట్

సోనీలివ్ ఓటీటీ ట్రాక్ పైకి ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ రావడానికి రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'కంఖజూర' ( జెర్రీ). అనేక కాళ్లతో పాకుతూ కనిపించే ఒక అల్పజీవి జెర్రీ. సాధారణంగా దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే అలాంటి జెర్రీ ఏ కారణంగానైనా శరీరంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని అంటారు. ఒక సాధారణ వ్యక్తి దారితప్పినా అంతే ప్రమాదమని చెప్పే సిరీస్ ఇది. 

 ఇజ్రాయిల్ వెబ్ సిరీస్ 'మ్యాగిపై' ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. మోహిత్ రైనా .. రోషన్ మాథ్యూ .. సారాజేన్ డయాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, చందన్ అరోరా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ నుంచి వదిలిన పోస్టర్స్ పై, ఓ సాధారణ జీవి అయిన 'జెర్రీ' ని హైలైట్ చేసిన దగ్గర నుంచి అందరిలో క్యూరియాసిటీ పెరుగుతూ పోతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి వివిధ భాషల్లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

'జెర్రీ'ని చూడటానికి చాలామంది చిరాకుపడుతూ ఉంటారు గానీ, దానిని చూసి ఎవరూ భయపడరు. అయితే కొన్ని సందర్భాలలో అది కూడా ప్రమాదకారి కాగలదు. అలాగే ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా తన పని తాను చూసుకునే ఒక సాధారణ వ్యక్తిని కొందరు అవమానపరుస్తారు. వాళ్లపై అతను ఎలా పగతీర్చుకుంటాడు? అందుకోసం 'జెర్రీ'లను  ఎలా ఉపయోగిస్తాడు? అనేదే కథ.

Kankajur'
Jerry
Mohit Raina
Roshan Mathew
Sarah Jane Dias
Chandan Arora
SonyLIV
Crime Thriller
Web Series
Israeli Series

More Telugu News